NationalNews Alert

ఆన్‌లైన్ డిగ్రీలు కూడా సమానమే

ఇక పై డిస్టన్స్ లెర్నింగ్ య ఓపెన్ , ఆన్‌లైన్ విధానాల ద్వారా పొందిన డిగ్రీలను కూడా ఫుల్ టైమ్ డిగ్రీలతో సమానంగా పరిగణించనున్నట్టు యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది. అదే విధఁగా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు , ఉన్నత విద్యా సంస్థలు అందించే పీజీ , యూజీ డిప్లామా కోర్సులు చేసే వారికి కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. కానీ కొన్ని  కోర్సులకు సంబంధించిన డిగ్రీలకు మాత్రం పూర్తిస్థాయి అనుభవం తప్పనిసిరిగా అవసరం అని పెర్కొంది. దంతో ఆన్‌లైన్‌లో కోర్సులు చేసే విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.