Home Page SliderTelanganaviral

ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్” రాజన్న సిరిసిల్ల

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన యువకుడు జీవితాన్ని ముగించుకున్న విషాద ఘటన తంగళ్లపల్లి మండలం దెసాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (20) సోమవారం తన వ్యవసాయ పొలాల్లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసుల సమాచారం ప్రకారం, వంశీ ఇంటర్మీడియట్ వరకు చదివి, కార్ మెకానిక్ వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి, సుమారు రూ.10 లక్షలు నష్టపోయినట్లు గుర్తించారు. ఈ మొత్తంలో చాలా భాగం అతను స్నేహితుల వద్ద నుండి అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది.తన కుమారుడి ఆర్థిక నష్టాల గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు గట్టిగా మందలించడంతో వంశీ తీవ్ర మనస్తాపానికి గురై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను ఈ క్రమంగా తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.వంశీ తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.