Home Page SliderTelangana

సీతారామలో కొనసాగుతున్న సొరంగం పనులు

టిజి: సీతారామ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా పాలేరు జలాశయానికి చేర్చి సుమారు 2.52 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్త ఆయకట్టుకు నీరందించవచ్చన్న ఉద్దేశంతో పాలేరు లింక్ కెనాల్ నిర్మిస్తున్నారు. ఇందులో ఆఖరి ప్యాకేజీ అయిన నెం.16 లో 8 కి.మీ.ల మేర సొరంగం కాలువ (టన్నెల్) తవ్వుతున్నారు. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం వద్ద సొరంగం ప్రారంభమై కూసుమంచి మండలం పోచారం వద్ద ముగుస్తుంది.