Home Page SliderNational

కొనసాగుతున్న ఆదిపురుష్ వసూళ్ల ప్రభంజనం

భారీ అంచనాలతో రిలీజైన ఆదిపురుష్ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. మొదటి రోజు చరిత్రను తిరగరాస్తూ 140 కోట్లు సాధించింది. అయితే ఈ చిత్రంపై అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రామాయణాన్ని వక్రీకరించారని, హనుమంతుడు, శ్రీరాముడు పాత్రల ఔచిత్యం దెబ్బతినేలా డైలాగులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల హిందూ సంఘాలు సినిమాను బ్యాన్ చేయాలంటూ, మేకర్స్ క్షమాపణలు చెప్పాలంటూ  తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ శ్రీరామునిగా నటించారు. కృతిసనన్ సీతగా నటించారు. అయితే మూడు రోజులలోనే 300 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. నాలుగవ రోజు ముగిసేసరికి 375 కోట్లకు పడగలెత్తింది. ఈ చిత్రం త్వరలోనే వెయ్యికోట్ల క్లబ్బులో అడుగుపెడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్ర ఓటీటీ హక్కులు 180 కోట్ల వరకూ అడుగుతున్నట్లు సమాచారం.