Home Page SliderNewsPoliticstelangana,

ఒక రాష్ట్రం- ఒక రేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఒక రాష్ట్రం- ఒక రేషన్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కొంతమందికి సొంతూరులోనూ, నగరంలోనూ కూడా రేషన్ కార్డులు ఉన్న సంగతి తమ దృష్టికి వచ్చిందని, అలాంటి కార్డులను గుర్తించి రద్దు చేస్తామన్నారు. ఈ నెల 11 నుండి 15వ తేదీలోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ లబ్దిదారుల జాబితాలను గ్రామ సభల్లో బహిర్గతం చేయాలని, ఈ నెల 24 లోగా గ్రామ సభలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒన్ స్టేట్- ఒన్ రేషన్ విధానాన్ని త్వరలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.