ఆమెకు ఓ న్యాయం.. మాకు మరో న్యాయమా?
హైదరాబాద్ లోని మాదాపూర్ ఐటీసీ కోహినూర్ వద్ద ఫుట్ పాత్ వ్యాపారులు ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారం లేకుండా రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు తమ సామగ్రిని తీసుకెళ్లారని ఆరోపించారు. అయితే హోటల్ కోహినూర్ ఎదురుగా కొంతకాలంగా ఫుట్ పాత్ పై పదుల సంఖ్యలో ఫుడ్స్ స్టాల్స్, ఇతర దుకాణాలు వెలిశాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఫుట్ పాత్ పై దుకాణాలు తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం టీఎస్ ఐఐసీ అధికారులు ట్రాఫిక్ పోలీసుల సహాయంతో ఆ దుకాణాలను తొలగించారు. సామగ్రిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో వీధి వ్యాపారులు ఆందోళనకు దిగారు. అక్కడే ఫుట్ పాత్ పై హోటల్ నిర్వహిస్తున్న కుమారీ ఆంటీకి ఓ న్యాయం.. మాకు మరో న్యాయమా? అంటూ నిలదీశారు. తమ సామగ్రిని తిరిగివ్వాలని పోలీసులను కోరారు.