Home Page SliderTelangana

“వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం” మరోవైపు

తెలంగాణలో వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు..ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 1635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందన్నారు. హరీష్, కేటీఆర్ మాట్లాడిందే ఈటెల మాట్లాడుతున్నారు. ఈటెల ఇప్పటికైనా పేదల వైపు నిలబడాలి. ఇలా వచ్చి అలా వెళ్లడం కాదు. ధైర్యం ఉంటే కేసీఆర్, హరీష్, ఈటెల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండండి..అంటూ సవాల్ చేశారు.

యువత కాళేశ్వరం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారో… నాగార్జున సాగర్ కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఆలోచించుకోండి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ఒకే విధంగా వ్యవహరించండి.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత మీ అందరిపై ఉంది. అంటూ యువతనుద్దేశించి పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ 2015లో నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని.. విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ కవచంగా మార్చుకున్నారు.. ఇవాళ ముసుగు తొలగిపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అని విమర్శలు కురిపించారు.

అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నాం. ఇది మా చిత్తశుద్ధి. ఇది మా బాధ్యత. అని పేర్కొన్నారు.