ఒక ఎన్నిక.. అందరినీ తృప్తి పరిచింది..!
అన్ని పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన మునుగోడు ఉప ఎన్నిక అందరికీ తృప్తిని కూడా ఇచ్చింది. అదెలాగంటే.. గెలిచినం అన్న సంతోషం అధికార పార్టీకి.. పోటీ ఇచ్చి ప్రత్యామ్నాయం మేమే అన్న గర్వం బీజేపీకి.. డిపాజిట్ దక్కకున్నా సరే.. రాజగోపాలుడి ఓటమికి కారణమైనామన్న సంతోషం కాంగ్రెసుకు.. మాతో పొత్తు వల్లే అధికార పార్టీ గెలిచిందన్న సంతోషం కమ్యూనిస్టులకి.. ఓటు బూచీ చూపెట్టి.. అందరి నుండీ దండిగానే దండుకున్న సంతోషం ఓటరుకు.. అవసరమే అనుకుంటూ అనవసరంగా వచ్చిన ఈ ఉప ఎన్నిక అందరి అవసరాలు తీర్చింది.