ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు..
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలోనే ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గం టల వరకు బడులు నిర్వహిస్తారు. అలాగే 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం క్లాసులు నిర్వహించనున్నారు. అనంతరం అన్ని స్కూళ్లలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు.

