ఏపీలో ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు
రాష్ట్రమంతా వేసవితాపం దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకూడదని మరోవారం రోజుల పాటు ఒంటిపూట బడులు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు యథాతథంగా పాఠశాల బోధనా సమయం ఉదయం 7:30 నుండి 11:30 వరకు రాగి జావ ఉదయం 8:30 నుండి 9:00 వరకు మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం 11:30 నుండి 12:00 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆదేశించారు.