Andhra PradeshHome Page Slider

ఏపీలో వైసీపీ హయాంలో లక్షన్నర కోట్ల పెండింగ్ బిల్లులు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శుక్రవారం (జూలై26) నాడు ఈ శ్వేతపత్రం విడుదల చేయవలసి ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో 2019-24 మధ్య కాలంలో లక్షన్నర కోట్లకు పైచిలుకు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు రాష్ట్రప్రభుత్వం గుర్తించింది. కాంట్రాక్టర్లు, ఉద్యోగులకు ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు రూ.వేల కోట్లలో ఉన్నాయని, పెండింగ్ బిల్లులలో ఏకంగా రూ.93 వేల కోట్లు CFMSలో అప్‌లోడ్ చేయలేదని ఈ సందర్భంగా ప్రభుత్వం గుర్తించింది. ఇవే కాక రూ.48 వేల కోట్లు బిల్లులు అప్‌లోడ్ చేసినవి కూడా చెల్లింపులు చేయలేదని పేర్కొంది.

ఆర్థిక శాఖ నుండి 20 వేల కోట్ల రూపాయలు, పంచాయితీ రాజ్ శాఖలో 14 వేల కోట్లు, మున్సిపల్ శాఖలో 8 వేల కోట్లు బకాయిలు ఉండగా, నీటి పారుదల శాఖకు, వివిధప్రాజెక్టులకు చెందిన బిల్లులు రూ.19,324 కోట్లు బకాయిలు ఉన్నాయని గుర్తించారు.