మరోసారి భారీగా పెరిగిన పసిడి ధరలు
దేశంలో గతకొన్ని నెలలుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.810 పెరిగి రూ.73,250కి చేరింది. కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.67,150గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా కేజీకి రూ.1400 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.98,500 వద్ద స్థిరపడింది. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.