మరోసారి వార్తల్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి..
దేశభక్తి కోసం జాతీయవాదాన్ని వదిలేయాలంటూ విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి పిలుపునివ్వడం సంచలనంగా మారింది. చెన్నైలోని సాయి యూనివర్సిటీ కాన్వొకేషన్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన పేదల సంక్షేమం కోసం పల్లెటూర్లకు వెళ్లి పనిచేయాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. దేశ, ప్రజలను మెరుగుపరచడమే దేశభక్తి, ఇంటర్ కనెక్ట్ అయిన ప్రపంచంలో జాతీయవాదాన్ని ఫాలో అవడం సరైనది కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దేశభక్తి కోసం జాతీయవాదాన్ని వదిలివేయలేమని, జాతిగా నిలబడలేని దేశం సొంత అస్తిత్వాన్ని కోల్పోతుందని మహనీయులు చెప్పారని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో ఎక్కువ పనిగంటలు పనిచేయాలంటూ వ్యాఖ్యానించిన ఆయనపై పలువురు మండిపడ్డారు. ఇప్పుడు ఆయనకు ఇతర దేశాల్లో వ్యాపారాలు ఉండడం వల్లే జాతీయవాదాన్ని ఒప్పుకోవడం లేదంటూ విమర్శలు కురిపిస్తున్నారు నెటిజన్లు. జాతీయవాదం లేకపోతే మిలటరీ ఎందుకంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.

