మరోసారి అధికారంలోకి-ఐప్యాక్ టీమ్ సభ్యులతో వైఎస్ జగన్
ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తున్నామంటూ దీమా వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఇవాళ బెంజ్ సర్కిల్ లోని ఐప్యాక్ కార్యాలయానికి వచ్చిన జగన్, పార్టీకి సేవలందించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఐదేళ్లకు మించి ఈసారి పాలన అందిస్తామన్నారు. గతంలో 22 ఎంపీలు, 151 ఎమ్మెల్యేలు వస్తాయంటే ఎవరూ నమ్మలేదని, ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయన్నారు. గతంలో కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లొస్తాయన్నారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశమంతా షాక్ అవుతుందన్నారు. ప్రజలు సుపరిపాలన చూసి మద్దతిచ్చారన్నారు. ఐ ప్యాక్ సేవలు వెలకట్టలేనివని, ప్రభుత్వంలోనూ ఉపయోగించామన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చారని, ఆయనకు కలలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని.. ఫలితాలతో దేశమంతటా ఏపీవైపు చూస్తోందన్నారు.
