Andhra PradeshHome Page Slider

మరోసారి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఒంగోలు వైయస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు గైర్హాజరైన మాగుంటను మంగళవారం విచారణకు రావాలని తాజా నోటీసుల్లో ఆదేశించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను అధికారులు ప్రశ్నించనున్నారు. సౌత్ గ్రూపులో శ్రీనివాసులురెడ్డి కీలకంగా ఉన్నట్లు భావిస్తున్న ఈడీ గత శనివారం విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. అయితే తన సోదరుని కుమారుడు అనారోగ్యంగా ఉన్న కారణంగా తాను చెన్నైలో ఉన్నందున విచారణకు రాలేకపోతున్నానని ఈడీకి ఆయన లేఖ రాశారు. కాగా ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన కుమారుడు రాఘవ జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 28 వరకు పొడిగించింది. కేసులో రాఘవ పాత్ర వెనుక తండ్రి శ్రీనివాసులు రెడ్డి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో వెళ్లడైనందున ఆయనను ప్రశ్నించాలని భావించిన ఈడీ మంగళవారం విచారణకు రావాల్సిందిగా తాజా నోటీసులు జారీ చేసింది.