ఓ వైపు పెళ్లి… మరోవైపు ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసిన వరుడు
పెళ్ళి అనేది జీవితంలో ముఖ్య ఘట్టం. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. అయితే కోల్‌కతాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఒకవైపు వివాహ తంతు జరుగుతుండగానే మరోవైపు వరుడు ఒడిలో ల్యాప్ టాప్ పెట్టుకుని వర్క్ చేసుకుంటున్న ఫోటో వైరల్‌గా మారింది. కోల్‌కతా ఇన్‌స్టాగ్రామర్స్ అనే అకౌంట్‌లో ఈ ఫోటోలు షేర్ చేశారు. పెళ్లి కొడుకు మండపంలో ల్యాప్‌టాప్ పట్టుకున్నాడు. పెళ్లి కొద్దీ గంటల ముందు అలా తన ఆఫీస్ వర్క్ చూసుకున్నాడు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి రోజున పనా అని కొందరు… మరికొందరు మీమ్స్ పోస్ట్ చేశారు. మీరు పనిచేసేది ఏ ఆఫీసు అని ఒకరు.. తోడా జ్యాదా హోగాయా అని మరొకరు కామెంట్స్ చేశారు.

