లీగల్లీ కన్వర్టెడ్‌పై….బీజెపి ఫైర్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి…భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై శుక్రవారం చేసిన సామాజిక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.నరేంద్ర మోదీ పుట్టుకతో బీసి కాదని,ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసి అని నిన్న సీఎం రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.దీంతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని కీలక నాయకులు సైతం ఈ రోజు సామాజిక మాధ్యమాల వేదికగా మోదీ…వాట్ ఈజ్ యువర్ సోషల్ క్యాటగిరీ అంటూ సెటైర్లు విసిరారు.అంతే కాదు బీజెపి వ్యతిరేకులు చాలా మంది ఎక్స్ లో ఈ విషయంపై స్పందించి మోదీని విమర్శించారు.దాంతో శనివారం తెలంగాణ బీజెపి నాయకులు స్పందించారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తాత ఫిరోజ్ ఖాన్ గాంధీ ఒక ముస్లిం అని, వాళ్ళ అమ్మ ఇటలీ దేశానికి చెంవదిన ఒక క్రైస్తవురాలని వ్యాఖ్యానించారు.అంతే కాదు.. రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం, ఏ దేశానికి చెందిన వ్యక్తి అనేది స్పష్టం తెలియజేయాలని బండి సంజయ్ కోరారు.

