Home Page SliderTelangana

ఓల్డ్ సిటీని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది:సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఓల్డ్ సిటీపై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం మాట్లాడుతూ..హైదరాబాద్‌ పాత బస్తీ ఓల్డ్ సిటీ కాదని ఒరిజినల్ సిటీ అన్నారు.అయితే గత ప్రభుత్వం ఓల్డ్ సిటీని మోసం చేసిందని సీఎం ఆరోపించారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వం తమ 10 ఏళ్ల పాలనలో ఓల్డ్ సిటీలోకి మెట్రోను తీసుకురాలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లోపు పాత బస్తీలో మెట్రో పూర్తి చేసి ఓట్లు అడుగుతుందని సీఎం పేర్కొన్నారు. కాగా పాతబస్తీలో మెట్రో నిర్మించకపోతే ఎల్అండ్‌టీ అధికారులను చంచల్‌గూడ,చర్లపల్లి జైలుకు పంపుతానని హెచ్చరించినట్లు సీఎం తెలిపారు.