Andhra PradeshHome Page Slidermovies

‘ఓజీ’ అంటే తిడుతున్నట్లుంది..పవన్ కామెంట్స్..

ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ‘ఓజీ’ అంటూ అభిమానుల అరుపులతో వేదిక మార్మోగిపోతోంది. దీనితో పవన్ చాలా సార్లు సహనం కోల్పోయి, వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించేవాడు. అయితే ఈ సారి కడపలో మాత్రం అలా ఎందుకు అరవొద్దన్నాడో రహస్యం చెప్పేశాడు. అదేంటంటే ‘ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అని, అందుకే ‘ఓజీ ఓజీ’ అని అరుస్తుంటే తనను తిడుతున్నట్లనిపిస్తోందని పవన్ చెప్పాడు. అది సినిమా కోసం అరుస్తున్నట్లు లేదని, బెదిరింపుల్లాగ అనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తన సినిమాల గురించి అప్‌డేట్స్ చెప్తూ హరిహర వీరమల్లు ఇక దాదాపు పూర్తయ్యిందని, తన వంతు షూటింగ్ ఇక 8 రోజులు మాత్రమే ఉందన్నారు. ఏపీలో కూడా పాపికొండలు, అరకు లాంటి మంచి లొకేషన్స్ ఉన్నాయని, అడవులలో అందమైన ప్రదేశాలున్నాయని పేర్కొన్నారు.