Andhra PradeshHome Page Slider

సాయంత్రం శ్రీశైలం గేట్లు ఎత్తనున్న అధికారులు

దేశవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం రిజర్వాయర్‌కు ఎగువన ఉన్న ఆల్మట్టి,తుంగభద్ర,జూరాల నుంచి భారీగా ప్రవాహం వస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ రోజే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్లు తెరిచి నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ నెల 30న గేట్లు ఎత్తాలని అధికారులు భావించారట. కానీ ఎవరు ఊహించని విధంగా వరద ప్రవాహం ఎక్కువగా వస్తుండడంతో ఈ రోజే గేట్లు తెరవాలని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.