షారూఖ్‌ఖాన్ 25 కోట్లు డిమాండ్ చేసిన NCB ఆఫీసర్
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే గుట్టురట్టు చేసింది సిబిఐ. మాదక ద్రవ్యాలు వినియోగించారంటూ నాడు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను విడుదల చేయాలంటే రూ. 25 కోట్లు లంచంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్టు సీబీఐ నిర్ధారించింది. 25 కోట్లు చెల్లించకపోతే మాదకద్రవ్యాల కేసులో షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఇరికిస్తానని బెదిరించినట్టు తేలింది. అక్టోబరు 2021లో ముంబయిలో క్రూయిజ్ షిప్‌లో మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్ ఖాన్, ఇతరుల అరెస్ట్ తర్వాత వాంఖడే, లంచం డిమాండ్ చేసినట్టు తేల్చారు. వాంఖేడు ఇప్పుడు అవినీతి, నేరపూరిత దుష్ప్రవర్తన ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.

వాంఖడే ఆస్తులు, విదేశీ టూర్ వివరాలను చూసిన సీబీఐ అధికారులు కళ్లు తేలేశారు. ఒక అధికారి ఇంతలా విదేశీ పర్యటనలు వెళ్లడం, గిఫ్టులు కలిగి ఉండటంతో సీబీఐ, వాంఖేడే గురించి పరిశోధన మొదలుపెట్టింది. విదేశీ పర్యటనలు, ఖరీదైన చేతి గడియారాల అమ్మడం, కొనడంపై సీబీఐ దృష్టి సారించింది. NCBలో అప్పటి ఇంటెలిజెన్స్ అధికారి ఆశిష్ రంజన్‌లపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారించింది. ప్రకటించిన ఆదాయం ప్రకారం వారు సంపాదించిన ఆస్తుల మ్యాచ్ కావడం లేదని అధికారులు నిర్ధారణకు వచ్చారు. విచారణలో వాంఖడే “విదేశీ పర్యటనలను సరిగ్గా వివరించలేదు. విదేశీ ప్రయాణాల ఖర్చులను తప్పుగా ప్రకటించాడు” అని సీబీఐ నిర్ధారించింది. ఎఫ్‌ఐఆర్‌లో వాంఖడే కాకుండా నలుగురు నిందితుల పేర్లు ఉన్నాయి. వీరిలో NCBలోని అప్పటి సీనియర్ అధికారులు విశ్వ విజయ్ సింగ్, ఆశిష్ రంజన్‌తో సహా, సాక్షి కేపీ గోసావి, అతని సహాయకుడు సాన్విల్ డిసౌజా ఉన్నారు.

డ్రగ్స్-ఆన్-క్రూయిజ్ కేసులో సాక్షిగా ఉన్న కేపీ గోసావి, అరెస్టు తర్వాత ఆర్యన్ ఖాన్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. NCBలో ఉద్యోగం లేని వ్యక్తి నిందితుడి వద్దకు ఎలా అనుమతించబడ్డారనే దానిపై విమర్శలు వెల్లువెత్తాయి. గోసావిని నిందితులతో కలిసి ఉండటానికి అనుమతించారని, స్వతంత్ర సాక్షిని నిబంధనలకు విరుద్ధంగా NCB కార్యాలయానికి రావడానికి కూడా అనుమతించారు” అంటూ CBI FIRలో పేర్కొంది. KP గోసావి ఇష్టానుసారం వ్యవహరించాడని, సెల్ఫీలు తీసుకున్నాడని. నిందితుడి వాయిస్ రికార్డ్ చేశాడని సీబీఐ ఫిర్యాదులో వెల్లడించింది. ఆర్యన్ ఖాన్ కుటుంబ సభ్యులను బెదిరించి, మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నారని ఆరోపిస్తూ వారి నుండి ₹ 25 కోట్ల మొత్తాన్ని లంచంగా తీసుకునేందుకు కుట్ర పన్నినట్లు FIR వివరించింది. “ఈ మొత్తం ఎట్టకేలకు ₹ 18 కోట్లకు సెటిల్ అయిందని, కెపి గోసవి, అతని సహాయకుడు సాన్‌విల్లే డిసౌజా కూడా లంచం సొమ్ముగా ₹ 50 లక్షల టోకెన్ మొత్తాన్ని తీసుకున్నారని… ఆ మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి వెనక్కి ఇచ్చారు.” అని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ ఆరోపించింది.

అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్న మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సిపి నాయకుడు నవాబ్ మాలిక్, గతేడాది గుండెపోటుతో మరణించిన డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో సాక్షి ప్రభాకర్ సెయిల్, ఈ ఆరోపణలు చేశారు. వాంఖడే గత ఏడాది చెన్నైలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ టాక్స్‌పేయర్ సర్వీసెస్‌కు బదిలీ అయ్యారు. ఇటీవల సీబీఐ దాడులు జరిపిన తర్వాత, దేశభక్తుడైనందున తాను శిక్షించబడ్డానంటూ చెప్పుకొచ్చాడు. దేశభక్తికి రివార్డు లభించిందన్నారు. 18 మంది సీబీఐ అధికారులు నా నివాసంపై దాడి చేసి 12 గంటలకు పైగా సోదాలు చేశారు, ఇంట్లో నా భార్య, పిల్లలు ఉన్నారు. ₹ 23,000 నగదు, నాలుగు ఆస్తి పత్రాలు లభించాయి. ఐతే తాను ఈ ఆస్తులు ఇంతకు ముందే సంపాదించానన్నాడు. అరెస్టు తరువాత, ఆర్యన్ ఖాన్ కేసులో “తగిన సాక్ష్యాలు లేవని” పేర్కొంటూ NCB అతనిని అభియోగాల నుండి క్లియర్ చేయడానికి ముందు 22 రోజులు జైలులో గడిపాడు.