ఒడిశా రైలు ప్రమాదం..5గురు ఉన్నతాధికారులపై వేటు
ఒడిశా రైలు ప్రమాదం జరిగి నేటికి దాదాపు 20 రోజులు అవుతుంది. అయితే దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులపై ఎట్టకేలకు వేటు పడింది. కాగా ఖరగ్‌పూర్ డివిజినల్ రైల్వే మేనేజర్,చీఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్,చీఫ్ సేఫ్టీ ఆఫీసర్‌తోపాటు ఆ డివిజన్‌కు చెందిన మొత్తం 5గురిని రైల్వేశాఖ బదిలీ చేసింది. ఈ నెల 2న ఒడిశాలోని బలాసోర్ ప్రాంతంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్,యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్,ఓ గూడ్స్ రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. కాగా ఈ దుర్ఘటనలో మొత్తం 292 మంది ప్రయాణికులు మృతి చెందారు. అంతేకాకుండా 1100 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విధంగా ఒడిశా రైలు ప్రమాదం ఎన్నో వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘోర రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపమే కారణమని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా ఇప్పటికి రైల్వే అధికారులు దీనిపై చర్యలు తీసుకొని బాధ్యులైన 5గురు అధికారులపై వేటు వేశారు.