Horoscope TodayNews

05.10.2022 రాశి ఫలాలు

అక్టోబర్ 5 జాతక ఫలితం


మేషం : ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ తగ్గుతాయి. మిమ్మల్ని వేధించిన వారు వెనక్కు తగ్గుతారు. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. సొంత నిర్ణయాలు, స్వయం కృషి సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. ఇప్పుడు తలపెట్టిన పనుల్లో అధిక లాభం ఉంటుంది. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు. ఆరోగ్యం పరవాలేదు.

వృషభం : ఉద్యోగంలో అధికార యోగం ఉంది. ఆర్థికంగా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

మిథునం : ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం చేతికి వస్తుంది. అధిక ధన లాభం ఉంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు వీలైనంతగా సహాయపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్ర దర్శనం ఉంది.

కర్కాటకం : ప్రయాణాలు లాభిస్తాయి. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఆటంకాలు ఎదురైనా చాలావరకు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు నిరుత్సాహం కలిగించవచ్చు. తోటివారి సహకారంతో కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం : మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగానే ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పట్టుదలగా పనులు పూర్తి చేసుకుంటారు. సంతానపరంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. బంధువులు కొందరు అపనిందలు వేసి ఇబ్బంది పెడతారు. ఆరోగ్యానికి ఢోకా లేదు.

కన్య : చాలా కాలంగా పీడిస్తున్న ఆరోగ్య సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా ఉద్యోగంలో లక్ష్యాలు పూర్తి చేస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనుల్ని ఇప్పుడు పూర్తి చేస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఎదుగుదలకు వీలైన సమయం ఇది. ఇప్పుడు తల పెట్టిన పనులు విజయాన్నిస్తాయి.

తుల : ఉద్యోగంలో చిన్నా చితకా సమస్యలేని రోజుండదు. వృత్తి, వ్యాపారాలవారికి మాత్రం సమయం చాలా బాగుంది. ఆర్థికంగా కాస్తంత మంచి కాలం నడుస్తోంది. సొంత నిర్ణయాలు మున్ముందు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానం గురించి శుభవార్తలు వింటారు. ఒక ముఖ్యమైన పనిని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వృశ్చికం : అవసరాలకు ధన సహాయం అందుతుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు, సమస్యల్లో మిత్రుల సలహాలు కూడా తీసుకోండి. శుభవార్త వింటారు. పిల్లలు పురోగతి చెందుతారు.

ధనుస్సు : ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. సమస్యలు ఎదురవుతున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ కోరిక నెరవేరుతుంది. సొంత నిర్ణయాలతో పాటు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది.

మకరం : ప్రస్తుతం మంచి కాలం నడుస్తోంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. సంకల్ప బలం బాగానే ఉంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలకు అవకాశం లేకుండా వ్యవహరించండి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు.

కుంభం : బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగ, కుటుంబపరంగా సమస్యలు ఎదురవుతుంటాయి. ఓపికతో వ్యవహరించి వీటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్‌గా ఉండండి. అభివృద్ది పైనే దృష్టి నిలపండి. అంతా మీరు అశించిన విధంగానే జరుగుతుంది. తలచిన పనులు చాలా వరకు నెరవేరుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీనం : ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతికి కాలం అనుకూలంగా ఉంది. కొన్ని ఇష్ట కార్యాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు బాగా సహాయం చేస్తారు. ఆదాయానికి సంబంధించి ఒక ముఖ్యమైన పని మీకు అనుకూలంగా నెరవేరుతుంది. గృహ లాభం, వాహన యోగం ఉన్నాయి. ఆరోగ్యం పరవాలేదు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మద్దికుంట శ్రీకాంత్ శర్మ
హిందూ ధర్మచక్రం సేవా సమితి
9849485645