Horoscope TodayNews

15.10.2022 ఈవాళ్టి జాతకం ఎలా ఉందంటే..!

15 అక్టోబర్ రాశి ఫలాలు


మేషం: అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. అన్ని రంగాలవారికి ఆశాజనకంగా ఉంటుంది. దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. తరచు సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలు కాగలవు.

వృష‌భం: ఇత‌రుల‌తో గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ప్ర‌తిప‌ని సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అదనపు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు.

మిథునం: ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. వృధా ప్ర‌యాణాలు చేస్తారు. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. స‌న్నిహితుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా మెల‌గ‌డం మంచిది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో సంతృప్తికరంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడంవల్ల మేలే జరుగుతుంది.

క‌ర్కాట‌కం: సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ‌సంతోషాలు అనుభ‌విస్తారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. ప్ర‌య‌త్న‌కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణ నిలదొక్కుకుంటారు. వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయలేర్పడతాయి. మీ యత్నాల్లో ఆలస్యంగానైనా మంచి ఫలితాలు లభిస్తాయి.

సింహం: బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ‌నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ బాధ‌లు తొల‌గిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శ‌తృబాధ‌లు దూర‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది.

క‌న్య‌: విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌రాదు. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. వృత్తి, ఉద్యోగ‌రంగంలోని వారికి ఆటంకాలెదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం. వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ చాలా అవసరం.

తుల‌: కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించ‌డం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త‌ప‌డ‌టం మంచిది. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యంతో రుణ‌ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది. అనారోగ్య బాధ‌ల‌కు ఔష‌ధ‌సేవ అవ‌స‌రం. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. మధ్య మధ్య ఔషధ సేవ తప్పదు.

వృశ్చికం: కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచ‌లంతో ఇబ్బంది ప‌డుతారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది. పిల్ల‌ల‌ప‌ట్ల మిక్కిలి జాగ్ర‌త్త వ‌హిస్తారు. కొన్ని మంచి అవ‌కాశాల‌ను కోల్పోతారు. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులుండ‌వు. బ్యాంకింగ్ పనులు మందకొడిగా సాగుతాయి. ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయం గమనించండి. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. దైవ, పుణ్యకార్యాలకు విరివిగా ధనంవ్యయం చేస్తారు. రాజకీయాలలో వారికి అవకాశవాదులు అధికం.

ధ‌నుస్సు: ధ‌ర్మ‌కార్యాలు చేయ‌డానికి ఆస‌క్తి పెరుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నం చేసు‌కుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మాన‌సిక ఆనందాన్ని అనుభ‌విస్తారు. పేరు ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. అలౌకిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రముఖుల సహకారంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. సోదరీ, సోదరులతో విందు భోజనం చేస్తారు.

మ‌క‌రం: శుభకార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన కార్యాలు పూర్తిచేస్తారు. ఒప్పందాలు, హామీల విషయంలో పునరాలోచన మంచిది. ప్రైవేటు సంస్థల్లో వారు, ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. మీ సంతానం మొండి వైఖరి మీకుఎంతో చికాకులను కలిగిస్తుంది.

కుంభం: మ‌న‌స్సు చంచ‌లంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిది. అకాల భోజ‌నం వ‌ల్ల అనారోగ్య బాధ‌ల‌ను అనుభ‌విస్తారు. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది. చెడు స‌హ‌వాసానికి దూరంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాలి. ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవటం క్షేమదాయకం. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది

మీనం: అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆల‌స్యంగా తొల‌గిపోతాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్ల‌కూడ‌దు. వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు. వ్యాపార రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ చాలా అవసరం.

మద్దికుంట శ్రీకాంత్ శర్మ
హిందూ ధర్మచక్రం సేవా సమితి
9849485645