14.10.2022 మీ రాశి ఫలం ఇలా ఉంది..!
మేషం
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. సమాజం, కుటుంబంలోని పెద్దల సహాయం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సాంస్కృతిక, ధార్మిక పనులు చేపడతారు. నలుగురికి సాయం చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వ్యాపారం సజావుగా సాగుతుంది. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి.
వృషభం
ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు, తోటివారితో స్నేహభావం పెరుగుతాయి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగి, సమయానికి పూర్తవుతాయి. స్నేహితులు, బంధువర్గంతో కలిసిమెలిసి ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఓపికతో పనులు చేస్తారు. చిన్నపాటి మనస్పర్ధలున్నా బాధ్యతల పట్ల శ్రద్ధ చూపుతారు. ఇంటాబయటా ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యం విషయంలో నియమాలకు లోబడి పనులు చేసుకుంటూ వెళతారు. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడంతో అన్ని విధాలుగా ఈవారం కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు కార్యసాఫల్యాన్నిస్తాయి. నలుగురిలో మంచిపేరు పొందుతారు. అందరి ఆదరణ లభిస్తుంది.
మిథునం
ఉద్యోగస్తులు ఆఫీసులో అందరితోనూ స్నేహంగా ఉంటూ పనులు పూర్తి చేసుకుంటారు. అధికారుల ఆదరణ పెరుగుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో చకచకా పనులు చేసుకుంటారు. స్నేహితులు, బంధువర్గం రాకతో ఆనందంగా ఉంటారు. కొన్ని విషయాలలో ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు విశ్వాసంతో, పట్టుదలతో ముందుకు వెళ్లాలి. కష్టేఫలి అన్నట్లుగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి. అనుకూల ఫలితాలకు నలుగురి సహకారం లభిస్తుంది. డబ్బు విషయంలో ఇబ్బందులు తొలగిపోతాయి.
కర్కాటకం
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. సంతోషంగా ఉంటారు. ఉన్నత భావాలు కలిగిన మనుషులతో స్నేహం ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలను పొందుతారు. స్నేహితులు, ఆత్మీయుల అండదండలు ఉంటాయి. డబ్బు రావడంలో కొంత ఆలస్యమైనా పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. దేవతా గురుభక్తి, పెద్దల పట్ల విశ్వాసం పెరుగుతాయి. వ్యాపారం, వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహం
సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. స్నేహితులు, బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. పనులపై మనసు నిలుపడం, శ్రద్ధతో చేయడం అవసరం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది. ఇంటా, బయటా సంతోషంగా ఉంటారు. భక్తిభావనలు పెంపొందుతాయి. పెద్దల సహకారం లభిస్తాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది.
కన్య
సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. మంచివారి సహవాసం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రుల సహకారం లభిస్తుంది. కొన్ని ఖర్చులు పెరుగవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఆదరణ పెరుగుతుంది. సంతృప్తిగా చకచకా పనులు చేసుకుంటూ వెళతారు. భూములు, వాహనాలు, గృహ నిర్మాణ విషయాలలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పనులు కలిసి వస్తాయి. కొంత ఆలస్యం జరుగవచ్చు. సరదాగా, సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం విషయమై శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. అనుకూల ఫలితాలతో మంచి స్థాయిలో నిలుస్తారు.
తుల
ఉద్యోగస్తులు ఆఫీసులో తోటివారితో స్నేహంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. సంతోషంగా ఉంటారు. స్నేహితులు, బంధువర్గంతో స్నేహం పెంపొందించుకోవాలి. సర్దుబాట్లు అవసరమవుతాయి. ఆస్తుల తగాదాలు, అనవసరమైన కలహాలకు వెళ్లకుండా పనులపై మనసు నిలుపడం అవసరం. శుభకార్య ప్రయత్నాలలో సహకారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వస్త్ర, వస్తువులను కొనే ప్రయత్నం చేస్తారు. పనిలో భారం పెరుగుతుంది.
వృశ్చికం
డబ్బు చేతికి అందడంతో సంతృప్తిగా ఉంటారు. కష్టపడి పనులను పూర్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహభావం నెలకొంటుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. ఇంటా బయటా సంతృప్తిగానే ఉంటారు. ఇంటికి కావలసిన వస్త్ర, వస్తువులను కొంటారు. కొత్త అవకాశాలు రావడంతో ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగవచ్చు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.
ధనుస్సు
కార్య నిర్వహణలో శ్రద్ధ చూపుతారు. అనుకూల ఫలితాలు పొందుతారు. సమయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఇంటా బయటా సహకారం లభిస్తుంది. ప్రేమభావనతో ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పనులు చేయడం కొంత అవసరం. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల అండదండలు లభిస్తాయి. తోటి స్నేహితులతో ఇబ్బందులు ఉండవచ్చు. వ్యాపారస్తులకు క్రయవిక్రయాలవల్ల ఆదాయం పెరుగుతుంది.
మకరం
ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా కలిసి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సంతృప్తిగా పనులు చేస్తారు. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పనివారితో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఆఫీసులో తోటివారితో స్నేహం పెంపొందించుకుంటారు. పై అధికారుల ఆదరణకు ప్రయత్నాలు అవసరం. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దల సహకారం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వాహనాలవల్ల ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల వల్ల అలసట ఉంటుంది. కొన్ని ప్రయాణాలు వాయిదా పడతాయి.
కుంభం
గత పెట్టుబడులలో తాత్కాలిక లాభాలు కొంత సంతృప్తినిస్తాయి. నిత్య క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటా బయటా హుషారుగా ఉంటారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దల సహాయ సహకారాలు తప్పకుండా అవసరం. వాహనాలవల్ల ఖర్చులు ఉండవచ్చు. పనులు ఉత్సాహంతో చేస్తారు. ఆఫీసులో తోటివారితో సంతృప్తిగా ఉంటూ, పనులను పూర్తి చేస్తారు. పిల్లల చదువు విషయంలో కలిసి వస్తుంది.
మీనం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆలోచించి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. కార్య నిర్వహణ పట్ల మనసు నిలుపుతారు. బకాయిలు వసూలవుతాయి. సిబ్బందిలో పూజ్యభావం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కొత్త పనుల ప్రారంభంపై ఆలోచిస్తారు. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారం, ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన వారం. స్నేహితులు, ఆత్మీయులతో సత్సంబంధాలు ఉంటాయి. బంధువుల రాకతో హడావుడి, సంతృప్తి ఉంటాయి. ఇంటా బయటా హాయిగా ఉంటారు. ఆస్తుల తగాదాలకు పరిష్కారం లభిస్తుంది.
మద్దికుంట శ్రీకాంత్ శర్మ
హిందూ ధర్మచక్రం సేవా సమితి
9849485645

