NationalNews

పోర్న్‌ సైట్లలో విద్యార్థినుల అశ్లీల వీడియో.. 8 మంది ఆత్మహత్యాయత్నం

బాలికల హాస్టల్‌లో విద్యార్థినులు స్నానం చేస్తుండగా తోటి  విద్యార్థిని తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసింది. అంతటితో ఆగకుండా సిమ్లాలో ఉంటున్న తన బాయ్‌ఫ్రెండ్‌కు ఆ నగ్న చిత్రాలు పంపించింది. ఎంతోకాలంగా జరుగుతున్న ఈ తతంగంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60 మంది విద్యార్థినుల వీడియోలను పంపించింది. ఆ ప్రబుద్ధుడు ఆ వీడియో క్లిప్పింగ్స్‌ను సోషల్‌ మీడియాతో పాటు పోర్న్‌ సైట్స్‌లో అప్‌లోడ్‌ చేశాడు. తమ వీడియోలు అశ్లీల సైట్లలో దర్శనమివ్వడంతో విద్యార్థినులు గజగజా వణికిపోయారు.

చండీగఢ్‌ యూనివర్సిటీని చుట్టుముట్టిన విద్యార్థినులు

ఈ ఘోరం పంజాబ్‌లోని మోహాలీలో గల చండీగఢ్‌ యూనివర్సిటీలో జరిగింది. ఈ ఘటనపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు వాపోతున్నారు. అవమాన భారాన్ని తట్టుకోలేక 8 మంది విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక విద్యార్థిని చనిపోయిందని వార్తలొచ్చాయి. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థినులు శనివారం అర్ధరాత్రి చండీగఢ్‌ యూనివర్సిటీని చుట్టుముట్టి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వీడియో తీసిన అమ్మాయిపై దాడి చేస్తారన్న భయంతో అధికారులు ఆమెను ఓ గదిలో బంధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై విద్యార్థినులు రాళ్లు రువ్వారు.