“ఓ ప్రభువా వారికి జ్ఞానం ప్రసాదించు”.. వైరల్‌గా మారిన వరద బాధితుల ప్రార్థనలు
“ఓ ప్రభువా మాపై దయ చూపించు.. ప్రతీ చోటుకూ వెళుతున్న రాజకీయనాయకులు మా కాలనీకి రావడం లేదు. మమ్మల్ని ఈ వరద బారి నుండి కాపాడు” అంటూ ఏసుప్రభును ప్రార్థించారు వరద బాధితులు. ఈ సమస్య నుండి మమ్మల్ని విడిపించే జ్ఞానం వారికి లేదు అంటూ వారిని క్షమించమని కోరారు కాకినాడ జిల్లా పిఠాపురం అరుంధతీ కాలనీ ప్రజలు. బైబిల్ చేతిలో పట్టుకుని, చేతులు పైకెత్తి ప్రభువును ప్రార్థిస్తున్న వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడి అధికారులకు, రాజకీయనాయకులకు జ్ఞానం ప్రసాదించమని కోరుతున్నారు అక్కడి ప్రజలు. అక్కడ వారికి ఏడాదికి మూడుసార్లు వరదలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఇలా వరదలు కాలనీలను ముంచెత్తుతున్నాయని, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా వారి కష్టాలు తీరట్లేదని వాపోతున్నారు. ఆ ప్రభువే ప్రభుత్వాన్ని తమ కష్టాలు తీర్చేలా చేయాలని కోరుకుంటున్నారు.


