ఎన్టీఆర్ వర్థంతి..ప్రముఖుల నివాళి
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని కొనియాడారు. స్త్రీలకు సాధికారతనిచ్చారని, అధికారం అంటే పేదల జీవితాలు మార్చే అవకాశం అని నిరూపించారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తూ నటుడిగా, నాయకుడిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.

