జపాన్ అమ్మాయికి ఎన్టీఆర్ ఫిదా..
జపనీస్ అమ్మాయికి తెలుగుభాషపై శ్రద్ధకు, అభిమానానికి ఫిదా అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. ‘దేవర’ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్‌లో పర్యటిస్తున్న ఎన్టీఆర్‌కు అభిమానుల నుండి అఖండ స్వాగతం, ప్రేమ లభించాయి. మహిళా అభిమానులతో మాట్లాడుతుండగా, ఒక జపాన్ యువతి “అన్నా..’ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం చూసి తెలుగు నేర్చుకున్నా, తెలుగు రాత కూడా నేర్చుకునే పుస్తకంలో రాశాను, నాకు మీరే ఇన్‌స్పిరేషన్” అంటూ పేర్కొంది. దీనితో షాక్ అయిన ఎన్టీఆర్ “వావ్.. మాకు మీరే పెద్ద ఇన్‌స్పిరేషన్” అంటూ మెచ్చుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినీ భాషా ప్రేమికుడిగా ఈ సంఘటన అసలు మరిచిపోలేను. భారతీయ సినిమా ప్రపంచాన్ని కదిలిస్తోంది అంటూ ట్వీట్ చేశారు.

