Andhra PradeshNews

పేరేకదా అని తీసేశారా… ఆయన పవరంటంటే?

ఘాటు వ్యాఖ్యలు చేయడానికి పెట్టింది పేరైన నందమూరి నటసింహం బాలకృష్ణ ఈసారి మరింత దూకుడు వ్యాఖ్యలు చేశారు. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడంపై ఆయన కస్సుమన్నారు. మార్చేయడానికి.. తీసేయడానికి ఎన్టీఆర్ ఓ పేరు కాదని… ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నుముక అని అభిప్రాయపడ్డారు. నాడు గద్దెనెక్కి తండ్రి ఎయిర్ పోర్టు పేరు మార్చాడని, ఇప్పుడు తనయుడు వర్సిటీ పేరు మార్చుతున్నారని భగ్గుమన్నాడు. ఎన్టీఆర్ పెట్టిన భిక్షతో ఎందరో నేతలు బతుకున్నారని వారిలో నేతలూ… పీతలూ ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్లు మార్చుకుంటూ పోతున్న మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచ భూతాలన్నాయన్నాయంటూ వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు బాలయ్య.