Home Page SlidermoviesNational

ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ ఓటీటీలో..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ పార్ట్ -1 త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నవంబర్ 8వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్, జూనియర్ ఎన్టీఆర్ జంటగా నటించిన ఈ దేవర చిత్రం ధియేటర్స్‌లో రూ. 500 కోట్లకు పైగా సాధించి రికార్డులు నెలకొల్పింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపిస్తాడు.  నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో నటించాడు.