Home Page SliderNational

ఇప్పుడు ప్రధాని వంతు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్

ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుండి G20 నాయకులకు విందు ఆహ్వానం మంగళవారం సాంప్రదాయ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అనే పదాన్ని ఉపయోగించడం వివాదానికి, ఊహాగానాలకు దారితీసినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ఇదే విధమైన ఒక లెటర్ వెలుగులోకి వచ్చింది. 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు కోసం బుధ, గురువారాల్లో ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన నోట్‌లో ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ ‘ అనే పదాన్ని ఉపయోగించారు.

‘ఆసియాన్-ఇండియా సమ్మిట్’ ‘భారత్ ప్రైమ్ మినిస్టర్’ రెండింటినీ ఉపయోగించారంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ విరుచుకుపడ్డారు. ‘మోదీ ప్రభుత్వం ఎంత గందరగోళంలో పడిందో చూడండి! 20వ ఆసియాన్-ఇండియా సదస్సు సందర్భంగా ప్రస్తావించారంటూ ట్వీట్ చేశారు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా అని పిలుచుకోవడం వల్లే ఈ డ్రామా’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పోస్ట్ చేశారు.

రాష్ట్రపతి G20 దేశాలకు ఆహ్వానం పంపుతున్న సమయంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 18-22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఇండియా, భారత్ అంశంపై చర్చ జరిగే అవకాశముందన్న వార్తలకు తాజా ఉదంతం మరింత బలాన్నిస్తోంది. ప్రత్యేక సమావేశానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఎజెండాను ప్రకటించకపోవడం ఊహాగానాలకు కారణమవుతోంది. ప్రతిపక్షం 28 పార్టీల కూటమిని ‘ఇండియా’ అని పిలుస్తోండటం, రేపు కూటమి పేరును భారత్ అని మార్చుకుంటే కేంద్రం ఏం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘‘ఎన్నో విపక్షాలు కూటమిగా ఏర్పడి ఇండియా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన కేంద్రం దేశం పేరు మారుస్తుందా.. దేశం ఒక్క పార్టీకి కాదు 140 కోట్ల మంది ప్రజలది.. కూటమి పేరును భారత్‌గా మార్చేస్తే.. వారు బీజేపీ ముందు ఉన్న భారత్ పేరును మార్చుతారా” అని ఆప్ చీఫ్ ప్రశ్నించారు. వచ్చే ఇండియా కూటమి సమావేశంలో తాము కూటమి పేరును భారత్ అని మార్చేందుకు ప్రయత్నిస్తామంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ట్వీట్ చేయడం కూడా విశేషం. ఇక బీజేపీ దేశానికి కొత్త పేరు చూసుకోవాల్సి ఉంటుందని ఆయన రాసుకొచ్చారు.

రాష్ట్రపతి ఆహ్వానంలోని పదాలు తనకు గర్వకారణంగా ఉన్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్వీట్ చేయడంతో పలువురు బీజేపీ నాయకులు నాయకులు ‘భారత్’ వినియోగాన్ని సమర్థించారు. స్వాగతించారు. “రిపబ్లిక్ ఆఫ్ భారత్ – మన నాగరికత అమృత్ కల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది” అని అసోం సీఎం ట్వీట్ చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. “దేశ గౌరవం, గర్వానికి సంబంధించిన” ప్రతి అంశంపై కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోందని ఆరోపించారు.