బైడెన్‌కు ఇకపై అవన్నీ రద్దు..ట్రంప్ కీలక నిర్ణయం..
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు కొన్ని అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు దేశ రహస్య సమాచారం తెలుసుకోవల్సిన అవసరం లేదని, అందుకే ఆయన భద్రతా అనుమతులు రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. రోజువారీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్‌లను తనకు కూడా 2021లో ఓటమి పాలయినప్పుడు నిలిపివేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాక, బైడెన్ పేలవమైన జ్ఞాపకశక్తితో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. అందువల్ల దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై బైడెన్ ఎలాంటి జవాబూ ఇవ్వకపోవడం గమనార్హం. అమెరికా సంప్రదాయంలో మాజీ అధ్యక్షులకు కూడా జాతీయ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకునే అధికారం ఉంటుంది.

