నవంబర్ 30 పోలింగ్ ఐపోవడంతో సందడంతా మాయం!
మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుండి అన్ని పార్టీల కార్యాలయాలు కార్యకర్తలతో సందడిగా కోలాహలంగా ఉండేవి. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ప్రచార వాహనాలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల రాకపోకలతో వాటి వద్ద కోలాహలం కనిపించేది. నవంబర్ 30న పోలింగ్ ముగియడంతో ఆ సందడంతా ఒక్కసారిగా కనుమరుగైంది. ఇన్నాళ్లు ప్రచారంలో తలమునకలుగా గడిపిన నాయకులు, కార్యకర్తలు మళ్లీ వారి వారి సొంత వ్యాపకాల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ప్రధాన పార్టీల కార్యాలయాలన్నీ వెల వెల బోతున్నాయి.