Home Page SliderNational

పోస్టల్ శాఖలో 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

పోస్టల్ శాఖలో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. కాగా ఇప్పటికే పోస్టల్ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో 12,828 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో 30,041 GDS పోస్టులకు తపాలాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఏపీలో 1058,తెలంగాణాలో 961 పోస్టులను పోస్టల్ శాఖ భర్తీ చేయనుంది. కాగా ఈ పోస్టులకు నేటి నుంచే దరఖాస్తులు ప్రారంభమైయ్యాయి. ఈ పోస్టులకు అర్హులను 10 వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. కాబట్టి 10 వ తరగతి పాసైన అభ్యర్థులు ఈ నెల 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.