హైద్రాబాద్ ఎన్నికకు నోటిఫికేషన్
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూలు విడుదలైంది. ఈనెల 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన, 9 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకటించింది. ఏప్రిల్ 29నాటికి ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1న ముగియనుండటంతో ఎన్నికకు ఈసీ షెడ్యూలు విడుదల చేసింది.


 
							 
							