పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీ.. పార్టీ మార్పు వ్యవహారంపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. వివరణ ఇవ్వడానికి సమయం కావాలని కోరారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో అనుకూలంగా తీర్పు రాకపోవడంతో బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ.. ఫిబ్రవరి 4 న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.

