రేసు కేసులో కేటిఆర్ తో పాటు వారికీ నోటీసులు
ఫార్ములా -ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటిఆర్ కు ఏసిబి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.కోర్టు ఇప్పటికే కేటిఆర్‌ని అరెస్టు చేయకుండా విచారించవచ్చని సూచించిన సంగతి తెలిసిందే.అయితే రేసు నిర్వహించిన వారితో పాటు రేసులో పాల్గొన్న వారికి ,ప్రోత్సహించిన వారికి కూడా ఏసిబి నోటీసులు ఇవ్వనుంది. దీంతో రేసులో పాల్గొన్న వారు తలలు పట్టుకుంటున్నారు. ప్రోత్సహించిన వారి జాబితాలో అక్కినేని కుటుంబీకులు కూడా ఉన్నారు.నాగార్జున,అఖిల్ సహా మొత్తం 5గురు ఉన్నారు.వారికి కూడా నోటీసులు ఇవ్వనుంది ఏసిబి.మొత్తం మీద స్టార్టింట్ టు ఎండింగ్ వరకు ఉన్న బిగ్ షాట్లందరికీ ఏసిబి నోటీసులు పంపనుంది. శుక్రవారం HMDAతో పాటు రెవెన్యూ అధికారులను ఏసీబీ ప్రశ్నించనుంది . ఫిర్యాదు చేసిన IAS అధికారి దాన కిషోర్ స్టేట్‌మెంట్ ని ఏసిబి రికార్డు చేయనుంది.