కేసీఆర్ కు నోటీసులు
కాళేశ్వరం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎంపీ ఈటల రాజేందర్ లకు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే.. కమిషన్ విచారణకు గడువును ప్రభుత్వం నిన్న పెంచిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి హరీశ్ రావు, ఈటల రాజేందర్ లకు జూన్ 6, 9 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు పంపింది. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులను కలిపి 200 మందిని ఇప్పటికే విచారించింది. డీపీఆర్ వాస్తవ నిర్మాణాలు వేరుగా ఉన్నట్లు గుర్తించిందని సమాచారం. ఈ క్రమంలో మాజీ సీఎం, మాజీ మంత్రులకు నోటీసులు ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.