Home Page SliderTelangana

టీఆర్ఎస్ కాదు.. ఇక బీఆర్ఎస్… ఈసీ గ్రీన్ సిగ్నల్

బీఆర్ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత రాష్ట్ర సమితి’గా ఆమోదిస్తూ… కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్‌కు అధికారిక లేఖ అందింది. రేపు మధ్యాహ్నం 1.20కి ఈసీ లేఖపై కేసీఆర్ సంతకం చేస్తారు. ఆ తర్వాత కేసీఆర్ బీఆర్ఎస్ జెండా ఆవిష్కరిస్తారు. రేపట్నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారుతోంది. రేపు తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులను తెలంగాణ భవన్‌కు రావాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు.