Home Page SliderNationalNewsSports

సూర్య కాదు.. శూన్య కుమార్.. వరల్డ్ చెత్త రికార్డు బద్దలు

ఆస్ట్రేలియా వర్సెస్ వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేల్లోనూ గోల్డెన్ డక్‌ ఔట్ కావడంతో చెత్త రికార్డ్ సృష్టించాడు. ఆస్ట్రేలియా సీరిస్‌లో పేలవమైన ప్రదర్శనతో డీలా పడ్డాడు. మొత్తం సిరీస్‌లో ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. వరుసగా మూడు వన్డేల్లో విఫలమవడంతో సూర్యకు జట్టులో స్థానం ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ఎన్నో అంచనాలున్నాయి. అయితే ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి అతనిపైనే పడింది. ఇక సోషల్ మీడియాలో సూర్యకుమార్ యాదవ్‌పై పంచులు ఒక రేంజ్‌లో పేలుతున్నాయ్.

చెన్నైలో జరిగిన డిసైడర్‌లో తొలి బంతికే డకౌట్ కావడంతో అభిమానులు సూర్యకుమార్‌ను తిట్టిపోస్తున్నారు. సీరిస్‌లో సూర్యకు ఇది వరుసగా మూడో డక్. మూడు గేమ్‌లలో డక్ అవుటైన వారికి గోల్డెన్ డక్ అని పిలుస్తారు. తన పేరు మీద ఇలాంటి చెత్త రికార్డును కలిగిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. మొదటి రెండు గేమ్‌లలో 4 నెంబర్ ఆటగాడిగా ఎంట్రీ ఇవ్వగా… చివరి మ్యాచ్‌లో 7వ స్థానానికి తగ్గించినా… పర్ఫామెన్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా పోయింది. నిన్నటి కీలక మ్యాచ్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్ అగర్‌ను ఎదుర్కొంటూ… ఇన్నింగ్స్‌లోని మొదటి బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించి ఔటయ్యాడు. అంతకు ముందు డెలివరీకి విరాట్ కోహ్లీ అవుటయ్యాడు. ఆ తరవాత బంతికే సూర్యకుమార్ పివిలియన్ దారి పట్టాడు.

కోహ్లీ చక్కటి అర్ధ సెంచరీతో 270 పరుగుల ఛేదనలో భారత్‌ను విజయపథంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. KL రాహుల్ ఔట్ అయిన తర్వాత, హార్దిక్ పాండ్యా మినహా ఎవరూ సరిగ్గా ఆడలేదు. హార్దిక్ 40 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరు ఇంటిదారి పట్టారు. మహ్మద్ షమీ మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో ఒక ఫోర్, సిక్సర్‌తో తన సత్తా చాటాడు, అయితే అవసరమైన రేటు అప్పటికే 12కి పైగా ఉంది. బంతితో మూడు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్ తన వంతు ప్రయత్నం చేశాడు కానీ చివరికి.. ఇండియా 21 పరుగుల తేడాతో ఓడి… సిరీస్‌ను 2-1తో కోల్పోయింది.