కోపంతో కసితో కాదు…పగతో కొట్టాడు
ఎవడైనా కోపంతో కొడతారు…కసితో కొడతారు….ఇంకా మంచి భాషలో చెప్పుకోవాలంటే తనికెళ్ల భరణి ప్రకారం శ్రద్దతో కొడతారు….కానీ పగతో కొట్టేవారు తక్కువగా ఉంటారు.అసలు పగతో కొట్టి సక్సెస్ సాధించిన వాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు.ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్న టీం ఇండియా రెండో రోజు రెండో ఇన్నింగ్స్‌లో ఇదే పగ కనిపించింది.ఆ పగ కూడా మూడేళ్ల కిందట ఛేజింగ్ డే టెస్ట్‌లో కొట్టిన వాడిలోనే కనిపించింది.ఇంతకీ ఎవరనుకుంటున్నారా…అతనే రిషబ్ పంత్.గబ్బా స్టేడియాన్ని గడగడలాడించి 90 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టడానికి ఎవరు కారకులయ్యారో అతనే ఇవాళ్టి టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ శివమెత్తాడు.రిషబ్ పంత్ ఆడుతుంటే…టి20,టి10 ఆడుతున్నట్లుంది గానీ టెస్ట్ ఆడుతున్నట్లు లేదు. కేవలం 31 బాళ్లలో 66 పరుగులు చేసి ఔటయ్యాడు.చాలా తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు రాబట్టి జట్టు స్కోర్‌ని గౌరప్రద స్థాయికి చేర్చాడు.

