పులివెందుల కాదు.. విశాఖలో ఏం జరిగిందో గుర్తుందుగా? జగన్‌కు లోకేశ్ చురకలు
యువగళం పాదయాత్రలో టీడీపీ యువనేత నారా లోకేశ్.. సీఎం జగన్‌కు డైరెక్ట్ సవాల్ విసిరారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్.. ఆ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో పోటీ చేసి గెలిచారని… ఈసారి ఆయన అక్కడ్నుంచి కాకుండా… వైసీపీ బలహీనంగా ఉన్న చోట పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు. కుటుంబానికి దన్నుగా ఉన్న నియోజకవర్గంలో ఎవరైనా గెలుస్తారని.. తాను అలా చేయకుండా టీడీపీ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచిన మంగళగిరి నుంచి కంటెస్ట్ చేశానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల కాకుండా మరో చోట పోటీ పోటీ చేస్తారా అని ప్రశ్నించారు లోకేశ్… తాను ఎన్నడూ గెలవని సీటులో పోటీ చేసి ఓడానని… ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్పాలన్నారు. విశాఖలో విజయమ్మ పోటీ చేస్తే ఏమైందో… అందుకు సమాధానం చెప్పాలన్నారు. జగన్ ఎప్పుడు పులివెందులలో మాత్రమే పోటీ చేస్తారని.. ఎప్పుడూ పోటీ చేయని సీటులో గెలిచి సత్తా చాటాలన్నారు. కంచుకోటలో గెలిచి చంకలు గుద్దుకోవడం ఎందుకన్నారు లోకేశ్. తాను ఎన్నికల్లో ఓడినా మంగళగిరి ప్రజల కష్టాల్లోనే ఉన్నాన్నారు.