హిందీ కాదు… తమిళ్‌లో మాట్లాడు… ఏఆర్ రెహ్మాన్ భార్య ఏం చేసిందంటే!
ఏస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాల్సిందిగా భార్య సైరా బానుని అభ్యర్థించారు. చెన్నైలో సైరా బానుతో కలిసి రెహ్మాన్ వేదికపై అవార్డును స్వీకరిస్తున్న సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. అవార్డు స్వీకరిస్తూ ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, నా ఇంటర్వ్యూలను మళ్లీ మళ్లీ చూడటం నాకు ఇష్టం ఉండదు. ఐతే భార్య సైరా బాను తన వాయిస్‌ని ఇష్టపడుతోంది కాబట్టి మళ్లీ మళ్లీ చూస్తుంటుందన్నారు. దీంతో హోస్ట్ సైరాను మాట్లాడమని అడిగ్గా… ఆమె ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించే ముందు, ఏఆర్ రెహమాన్ భార్యను హిందీలో మాట్లాడొద్దని కోరారు. తమిళంలో మాట్లాడాలని చెప్పారు. హిందీలో కాకుండా తమిళంలో మాట్లాడాలంటూ ఆటపట్టించారు. ఐతే ఆమె మాత్రం తమిళం అంతగా రాదని, ఇంగ్లీషులోనే మాట్లాడారు. AR రెహమాన్, సైరా బాను 1995లో వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. ఖతీజా, రహీమా, అమీన్.

