“సరిపోదా శనివారం” రన్ టైంకు బ్రేక్!?
నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “సరిపోదా శనివారం” కోసం తెలిసిందే. మరి క్రేజీ అనౌన్స్‌మెంట్‌తో మొదలైన ఈ చిత్రం జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్‌తో అదరగొట్టబోతోంది. ఇలా ఈ చిత్రంపై ఇప్పుడు మంచి బజ్ సంతరించుకోగా కామన్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇపుడు తెలుస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమా బుకింగ్స్ పలు చోట్ల మొదలు కాగా అక్కడ రన్ టైం అయితే ఇప్పుడు రివీల్ అయింది. దీంతో ఈ చిత్రం 2 గంటల 35 నిమిషాల అవుట్ పుట్‌తో రాబోతోంది అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇండియాలో ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. సో, ఇక్కడ కొంచెం మార్పు ఉండొచ్చు లేదా అదే రన్ టైంతో రావచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ తన సంగీతంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్టు 29న సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కావడానికి సిద్ధమౌతోంది.