Home Page SliderInternational

ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం

 ఉత్తర కొరియా మరోసారి తన దుందుడుకు చర్యను ప్రదర్శించింది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి, జపాన్ సముద్రజలాలలో పడవేసింది. జపాన్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.15 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్ని జపాన్ కోస్ట్‌గార్డ్ నిర్థారించింది. ఉత్తర కొరియా నియంత కిమ్ సోదరి యో జోంగ్ మంగళవారం నాడే అమెరికాను బెదిరిస్తూ, తమ దేశ భూభాగంలోకి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మర్నాడే ఇలాంటి క్షిపణి ప్రయాగం చేయడం సంచలనం రేపింది. ఈ ఆరోపణను అమెరికా ఖండించింది. తామెప్పుడూ ఇతరదేశ సరిహద్దులోకి ప్రవేశించలేదని తేల్చి చెప్పింది. గత సంవత్సర కాలంలో ఉత్తర కొరియా దాదాపు 100 క్షిపణి ప్రయోగాలు నిర్వహించింది. మరో నిఘా ఉపగ్రహానికి కూడా ప్రయత్నం చేస్తోంది. కొరియా నుండి అమెరికాకు శక్తివంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించే దిశలో ఐసీబీఎంలను తయారు చేస్తోంది ఉత్తర కొరియా. దీనితో దక్షిణకొరియా, అమెరికా జపాన్ వంటి దేశాలు కూడా తమ యుద్ధ విన్యాసాలను పెంచుకుంటున్నాయి.