హైదరాబాద్‌లో విజృంభిస్తున్న నోరో వైరస్..తస్మాస్ జాగ్రత్త
హైదరాబాద్ నగరంలో విజృంభిస్తున్న నోరో వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే యూకుత్ పురా, మలక్ పేట, పురానా హవేలీ, మొఘల్ పూరా వంటి ప్రాంతాలలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కలుషితమైన నీరు, ఆహారం కారణంగా వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు, చలిజ్వరం, నీరసం, కడుపునొప్పి,డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు గుర్తించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ఇంటిని, పరిశరాలను క్రిమి సంహారక మందులతో శుభ్రం చేసుకోవడం అవసరం. కాచి, చల్లార్చిన నీటిని తాగడం మంచిది. ఆహారాన్ని పరిశుభ్రమైన ప్రదేశంలోనే వండుకోవడం, తినడం చేయాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ బారి నుండి కాపాడుకోవచ్చు.