Home Page SlidermoviesTelanganatelangana,Trending Today

దిల్ రాజు నివాసంలో ఆగని ఐటీ సోదాలు

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంటిలో ఐటీ సోదాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గత మూడురోజులుగా సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు కూడా ఒక మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఆయన నివాసం, ఆయన కుమార్తె ఇళ్లు, సోదరుడి ఇళ్లు, కార్యాలయాలలో 21 మంది ఐటీ సిబ్బంది మంగళవారం నుండి సోదాలు మొదలుపెట్టారు. అయితే నిన్నటితో దర్శకుడు సుకుమార్, దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసాలలో సోదాలు ముగిశాయి.