Home Page SliderTelangana

నిర్వాసితులకు డబుల్ బెడ్రూంతో సహా రూ. 25 వేలు

ఆపరేషన్ మూసీ వేగవంతంగా కొనసాగుతోంది. నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించడంతో పాటు వారు అక్కడికి సామాగ్రి తరలించుకునే ఖర్చుల కోసం రూ. 25వేల నగదును కూడా ఇస్తున్నామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రివర్ బెడ్ లో మొత్తం 863 ఇండ్లు ఉండగా.. ఇప్పటి వరకు 163 ఇండ్లను అధికారులు ఖాళీ చేయించారు. 150 ఇండ్లను ఇప్పటి వరకు అధికారులు కూల్చివేశారు. రంగారెడ్డి,మేడ్చల్ జిల్లాల పరిధిలోనూ రివర్ బెడ్ లో ఉన్న ఇండ్లను ఖాళీ చేయించారు. నిర్వాసిత కుటుంబాలకు జియాగూడ 15, పిల్లి గుడిసెలు 136, ప్రతాప సింగారం 16, నార్సింగిలో 7 డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారు. ఖాళీగా ఉంటే అందులోకి వేరే వాళ్లు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు కూల్చివేతలను వేగవంతం చేశారు.