నో పర్చెస్.. నో వాష్ రూం..
ఇకపై కస్టమర్లు తమ కేప్ లో వాష్ రూంలను వాడుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు చేయా ల్సిందేనని ప్రముఖ స్టార్ బక్స్ కంపెనీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేసింది. కొత్త విధానం ప్రకారం.. స్టార్ బక్స్ స్టోర్లలో ఉండేందుకు, సౌకర్యాలను ఉపయోగించేందుకు తప్పనిసరిగా ఏదైనా కొనుగోలు చేయాల్సిందేనని పేర్కొంది. అంతేకాకుండా కస్టమర్లు స్టోరు వచ్చిన తర్వాత ఏమైనా డ్రింక్ తీసుకుంటారా లేదా అని అడిగే హక్కు కూడా సిబ్బందికి ఉంటుందని తెలిపింది. కొంతసేపు ఉండాలనుకునే వారికి అపరిమితంగా కోల్డ్ లేదా హాట్ కాఫీ అందించనున్నారు. ఎవరైనా కస్టమర్లు ఈ నిబంధనలను నిరాకరిస్తే వారిని బయటికి పంపే హక్కు నిర్వాహకులకు ఉంటుందని, అవసరమైతే ఉద్యోగులు చట్టపరంగా కూడా చర్యలకు ముందుకెళ్లవచ్చని కంపెనీ వివరించింది.

